Interview with Ramachandrapuram MLA

నేను రామచంద్రపురం నియోజకవర్గం సేవకుడిగా వచ్చాను , సేవకుడిగానే ఎన్నికల్లో పోటీ చేసాను, ప్రజలు నన్ను నమ్మారు ,జగన్  మోహన్ రెడ్డి ఆశీస్సులతో గెలిచాను ,భవిష్యత్ లో సేవకుడి గానే సేవలు అందిస్తాను , నాకు జగన్ మోహన్  రెడ్డి వజ్ర సంకల్పం అంటే ఇష్టం ,అదే నాకు ఆదర్శం … అని రామచంద్రపురం ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణ అన్నారు … ఫోకస్ ఛానెల్ కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు .. ఆయా విశేషాలు తెలుసుకొందాం

ప్ర ; ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  బిజీ గా ఉంటున్న మీరు నియోజకవర్గం ప్రజలకు దూరం అవుతున్నారా ?
ఎమ్మెలే జవాబు :నియోజక వర్గం ప్రజల మధ్యలోనే ఉంటున్నాను … స్థానిక అయ్యప్ప భక్తులు మాల వేశారు వారితోనే కలసి కొండకు వెళ్ళాను .. కేవలం హిందూ దేవాలయము కాదు … మసీదు ,చర్చి లకు కూడా వెళ్తుంటాను

ప్ర ;నాయకుడికి సేవకుడికి తేడా  ఏంటి ?
జవాబు :2001 కి ముందు నేను పొన్నమండ లో ఉండే వాడిని … నాడు ఏ  పదవి లేకపోయినా సరే అక్కడ సేవకుడిగా పని చేశాను .. అప్పుడే నాకు సేవ చేయడం అలవాటు అయింది … రామచంద్రపురం లో నాయకులకు కొరత లేదు ..సేవకుల అవసరం ఉంది అందుకే నేను సేవకుడిని అయ్యాను

ప్ర : జిల్లా పరిషత్ చైర్మెన్ గా మీ సేవలు పట్ల అసంతృప్తి వచ్చింది అంట నిజమేనా ?
జవాబు: జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా నేను అనేక ప్రక్షాళనలు  చేసాను  ఏండ్ల  తరబడి తిష్ట వేసిన అధికారులను బదిలీ చేయించాను ..s k బి  సత్యనారాయణరావు గారి సేవలు ఆధర్శంగా  తీసుకొని సేవలు అందించాను ..ఈ క్రమం లో నా పై ఆరోపణలు రావడం  సహజం

ప్ర:కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గార్కి మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయా ?
జవాబు:నాకు వ్యాపారాలే లేవు ..ఫుల్ టైం పాలిటిక్స్   ఆయన తో నాకు మంచి స్నేహం మాత్రమే

ప్ర:మీకు కులాభిమానం ఎక్కువ అంట కదా ?
జవాబు :ఈ నియోజక వర్గం లో బి సి లు చాల ఎక్కువ  ..అందులో ఎక్కువ మంది వైఎస్సార్  అభిమానులు ,వారు నా వద్దకు ఎదో పని మీద వస్తుంటారు ..అందుకే ఆ ముద్ర పడింది ..సహజంగా నాకు అందరూ కావాలి. నేను అందరి వాడిని

ప్ర: డిప్యూటీ సీఎం  సుభాష్ చంద్ర బోస్ గార్కి మీకు వివాదాలు ఏంటి ?
జవాబు :ఏమి లేవు .. బోస్ గారు అంటే నాకు చాల గౌరవం ..ఆయనే నాకు ఆదర్శం

ప్ర:వ్యక్తిగతంగా వృత్తి పరంగా మీకు ఆనందం కలిగించిన విషయం
జవాబు:అసెంబ్లీ  లో బి సి  బిల్లు ప్రవేశ పెడుతున్న సమయం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డ్డి నన్ను ప్రత్యేకంగా మాట్లాడమని అడగడం తో నాలో అనందానికి హద్దులు లేవు

ప్ర:  మీ   జీవితం లో విషాద కరమైన సంఘటన  ?
జవాబు: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం ..నా జీవితము లో మరుపురాని విషాద సంఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *