హాయ్ శుభోదయం అండీ నేను మీ సే వకుడ్ని నా పేరు వేణు

హాయ్ గుడ్ మార్నింగ్ అండీ … నా పేరు చెల్లిబోయిన వేణు గోపాల కృష్ణ … నేను నియోజక వర్గం సేవకుడిని …. అంటూ రామచంద్రపురం ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణ వేకువ జామునే ఇంటింటా పర్యటిస్తున్నారు. మీ ప్రాంతం లో ఏదైనా సమస్యలు ఉన్నాయా …. నా సహాయం ఏదైనా కావాల అంటూ ప్రతి ఇంట పర్యటిస్తున్నారు .. దీంతో నియోజక వర్గం ప్రజలు ఆనందం లో మునిగి తేలుతున్నారు .. వివరాల లోకి వెళ్ళితే ….. సాధారణంగా ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఒక్క పూట పని పోతుంది .. ఆలా ఒక్క పూట కేటాయించిన సరే సదరు ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా మన

గోడు వింటారో లేదో అనే అనుమానం ..దీంతో సామాన్య పౌరులకు ఎన్ని సమస్యలు ఉన్న సరే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటే ఇబ్బందే …కానీ వాటన్నింటికి అతీతం రామచంద్రపురం ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణ .. వేకువ జామునే నిద్ర లేచి ద్విచక్ర వాహనం మీద అధికారులను వెంట బెట్టుకొని రోజుకో ప్రాంతం పర్యటిస్తున్నారు . అక్కడ ఇంటింటికి వెళ్తున్నారు .. అమ్మ మీ సమస్యలు ఏంటి ..మీకు ఏమి కావాలి .. అంటూ పలకరిస్తున్నారు ..దీంతో ప్రజలు తమ సమస్యల గోడు వెళ్లగక్కుతున్నారు .. స్వయానా ఎమ్మెల్యే నే ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలి అని అడగడం ఒక నూతన వరవడి కి శ్రీకారం అంటున్నారు .. కార్యక్రమం లో ఆయన వెంట గుబ్బల ఏసురాజు ,డీసీఎంస్ డైరెక్టర్ గణపతి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *