స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైసీపీ నాయకులు

గ్రామాల్లో రచ్చబండ రాజకీయాలు షురూ

సర్పంచ్ , ఎంపీటీసీ ల అభ్యర్థులు ఆంతరంగిక ప్రచారం

రిజర్వేషన్ల కోసం ఒక్కటే ఆత్రుత

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు అయింది .. సర్పంచ్ ఎంపీటీసీ పదవుల కోసం ఇప్పటికే పోటీలు పడుతున్నారు .. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నకు మంచి మెజార్టీ రావడం తో ఆయా పార్టీ నాయకులూ మరింత ఉత్సహం చూపిస్తున్నారు .. ఇక తెలుగు గ్రామాల్లో దేశం వారు ఆయా ప్రాంతాలను బట్టి పాచికలు కదుపుతున్నారు .. ఇక జనసేన వారు కూడా మంచి ఉత్సహం గా ఉన్నారని చెప్పాలి … దీంతో గ్రామాల్లో రాజకీయ రచ్చ ఆరంభం అయింది

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోర్డర్ లో అధికారం చేపట్టింది … వెను వెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం లో అనేక మంది వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు .. కొన్నిచోట్ల విజయం సాధించారు … అయితే ఆలా విజయం సాధించిన వారిని మాత్రం అప్పటి ప్రభుత్వం పూర్తిగా డమ్మీ చేసింది … ఏ పని కూడా చేయకుండా ఆదుకోంది ..కొందరిని బలవంతం గా పార్టీ లోకి లాక్కొంది ..

తాజాగా వైసీపీ ప్రభుత్వం మంచి మెజార్టీ తో గెలవడం తో ఆయా కార్య కర్తల్లో మంచి ఉత్స్తాహం చూస్తూ చేసుకోంది .. తమ గ్రామాల్లో ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంపీపీ ,జడ్పీటీసీ పదవులకు పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు … కొందరైతే ఇప్పటికే తమ మనస్సులో మాట ఆయా గ్రామస్తులకు చెప్పుకొంటున్నారు . కొందరు తమ ఎమ్మెల్యే ల కను సన్నలలో మసులుతున్నారు .. కొందరు ఇప్పటికే బెర్త్ సారాలు ప్రారం భించారు ..

రిజర్వేషన్ల పై చాలా ఆత్రుత వ్యక్తం చేస్తున్నారు ..ఎం డి వో ,ఆర్దీవో ,జిల్లాపరిషత్ కార్యాలయాలు చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు .. ఇదిలా ఉండగా సంక్రాంతి నకు ముందుగానే ఎన్నికల కోడు ప్రకటిస్తారని అంటున్నారు .. అప్పుడే రిజర్వేషన్లు కూడా ప్రకటిస్తారని సమాచారం .. ఈ మేరకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది .. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చి ,అనంతరం అమ్మవడి సొమ్ములు అందరి ఖాతాలో కి వేసి అప్పుడు ఎన్నికల కోడు ప్రకటిస్తారని తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *