అమ్మ వడి పథకం నకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం

జనవరి 13 లోగా తల్లుల ఖాతాలోకి సొమ్ములు

జనవరి 13 వ తేదీ నాటికి అమ్మ వడి పథకం ఇచ్చేందుకు ప్రభత్వం రంగం సిద్ధం చేసింది … ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గ్రామ సభలు ప్రారంభించారు … దీంతో ప్రభుత్వం ఈ పథకం పేద తల్లులకు ఇచ్చేందుకు కృత నిశ్చయం తో ఉంది … గత అసెంబ్లీ ఎన్నికల కు ముందు జగన్ మోహన్ రెడ్డి అమ్మ వడి పథకం ఇస్తామని హామీ ఇచ్చారు …అదే విధంగా నవ రత్నాల్లో ఆయా పథకం ను చేర్చారు … ప్రస్తుతం ప్రభుత్వం అధికారం లోకి రావడం తో ఇచ్చిన మాటకు కట్టుబడి జనవరి 13 నాటికి ప్రతి తల్లి ఖాతాలో సొమ్ములు వేసేందుకు సిద్ధం అవుతున్నారు

ప్రతి పేద వాడు తనకు నచ్చిన పాఠశాలలో తనకు నచ్చిన సబ్జెక్టు చదువుకోవాలనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మ వడి పథకం ప్రవేశ పెట్టారు … గత ప్రభుత్వాలు ఎవ్వరు చేయని సాహసాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేసారు … ఇదే పథకం గత ఎన్నికల్లో వైసీపీ హామీ గా ప్రకటించింది .. అంతే గాక నవరత్నాల్లో దీన్ని చేర్చింది … ఈ నేపథ్యం లో జగన్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ పథకం ప్రకటించారు ..

ఈ పథకం ప్రయివేట్ ,ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది .. కుటుంభం లో ఒక్క విద్యార్థికి మాత్రమే పథకం వర్తిస్తుంది .. ఆయా విద్యార్థి తల్లి ఖాతాలో 15000 జమ అవుతాయి .. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయనే వదంతులు నమ్మ వద్దని అధికారులు అంటున్నారు … పండగ లోగా అర్హులైన అందరి విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ములు జమ కానున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *