అతడే ఒక సైన్యం

డిసెంబర్ నెల …… వేకువ జామున ….. మంచు దట్టం గా కురుస్తున్న వేళా … ఓ ప్రక్కన ఎముకలు కొరికే చలి ….. ఓ బడుగు బలహీన వర్గం నాకు చెందిన కాలనీ …. ఆ కాలనీ లో అప్పుడే నిద్ర మత్తు నుంచి తేరుకొంటున్నాడు గంగయ్య ….. ఇంతలో బయట ఎదో వినికిడి …. చప్పుడు ఏంటీ అంటూ సందేశిస్తూ ….. కళ్ళు నలుపుకొంటూ … తలుపు తీసాడు గంగయ్య …. ఎదురు గుండా నిలువెత్తు విగ్రహం … చలిని సైతం లెక్క చేయకుండా గంగయ్య ఇంటి ముందునకు వచ్చి ముందుగా వినయంగా నమస్కరించారు … వెంటనే ఎదురుగా ఉన్న వ్యక్తి నుంచి సూటి ప్రశ్న .. నేను మీ సేవకుడిని … మీకు ఏ సహాయం కావాలి అని అడిగారు … వెంటనే గంగయ్య ఆశ్చర్య పోయాడు … బాబూ మీరా … ఈ చలి లోనా అన్నాడు గంగయ్య …. సీన్ కట్ చేస్తే ఆ ఎదురుగా వున్నది ఎవరో కాదు … రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణా ………

భోగి పర్వ దినం …. నాడు పండగ పూట అయినా సరే సారయ్య అనే పారిశుధ్య కార్మికుడు నీరసంగా నిద్ర లేచాడు.. పండగ పూట కూడా వీధులు శుభ్రం చేయడం తప్పదు అని గొణుక్కొన్నాడు … రోజంతా పట్టణాన్ని ఊడ్చిన సరే అభిమానం గా పలకరించే వాడు లేడు అని మనసులో అనుకొన్నాడు … ఇంతలో అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు .. మిమ్మల్ని శాసన సభ్యులు వారు రమ్మన్నారని అన్నాడు .. దీంతో కంగారుగా అక్కడి నుంచి వెళ్ళాడు .. తీరా ఎమ్మెల్యే వద్దకు వెళ్ళితే అక్కడ సీన్ చూసి సారయ్య ఆశ్చర్య పోయాడు .. అదేటంటే ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ సారయ్య తోటి కార్మికులకు బట్టలు పెట్టి వారి పాదాలకు నమస్కరిస్తున్నారు .. అది చూసిన సారయ్య ఆనందం తో కన్నీళ్ల పర్వతం అయ్యాడు .. మా కన్నీళ్లను తుడిచే సేవకుడు వచ్చాడు అంటూ ఆనడం తో ఉరకలు వేసాడు

ఇటీవల కాలం లో రామచంద్రపురం సేవా కార్యక్రమాలతో తడిసి ముద్దా అవుతుంది …
జనవరి ఒకటవ తేదీన ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ ఇంటికి విషెస్ చెప్పడానికి వెళ్లిన వారికి కడుపు నిండా భోజనం పెట్టి , వారిని గౌరవించి పంపించారు .. భోగి నాడు పట్టణం లో పారిశుధ్య కార్మికులకు బట్టలు పెట్టి వారిని సన్మానించారు .. సంక్రాంతి నాడు పోలీసు వారిని సత్కరించారు … కనుమ నాడు క్రీడాకారులను సత్కరించారు .. ఈ విధంగా పండుగ జనం మధ్యలో ఘనం గా జరుపుకొన్నారు .. అదే విధముగా మూడు రాజధానుల ఆ వశ్యకత తెలుపుతూ మంచి కార్యక్రమాలు చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *